Friday, 9 March 2018

ట్రిపుల్ ఐటీ’లో చేరాలంటే ఈ సూచనలు పాటించాల్సిందే..

▪బాసర:
✍ పదో తరగతి విద్యార్థులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న బాసర ట్రిపుల్‌ ఐటీ 2017-18 సంవత్సరానికి గాను ప్రవేశా లకు నోటిఫికేషన్‌ విడుదలైంది.
✍ తెలంగాణలో ఉన్న ఏకైక రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ ఐటీ)లో వెయ్యి సీట్ల భర్తీకి మంగళ వారం యూనివర్సీటి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
✍ 28వ తేది నుంచి ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.
✍ ఫలితాలకు సంబంధం లేకుండా పదో తరగతి హాల్‌ టికెట్‌ నెంబరుతో దరఖాస్తులు చేసుకోవచ్చు.
✍ యూనివర్సీటి సెకండరీ బోర్డు నుంచి మార్కుల జాబితాను తీసుకొని ప్రవేశాల ఎంపిక జాబితాను విడుదల చేయనున్నారు.
👉 ప్రవేశ అర్హతలు..
✍ 2017 ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన పరీక్షల్లో రాష్ట్రంలో గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
✍ ఒకేసారి పదో తరగతి పరీక్షల్లో పాసై ఉండాలి.
రిజర్వేషన్లు...
✍ ట్రిపుల్‌ ఐటీలో మొత్తం వెయ్యి సీట్లకు గాను 85 శాతం సీట్లు తెలంగాణ వాసులకే కేటాయించనున్నారు.
✍ మిగతా 15 శాతం సీట్లు ఓపెన్‌ కెటగిరిలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌ మెరిట్‌ విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు.
✍ రిజర్వేషన్‌ ప్రకారం పరిశీ లిస్తే ఎస్సీకి 15,
👉 ఎస్టీ 6,
👉 బీసీ-ఏ 7,
👉 బీసీ- బి-10,
👉 బీసీ-సీ 1,
👉 బీసీ-డీ 7,
👉 బీసీ-ఈ 4,
👉 ఫిజికల్లీ హ్యండిక్యాప్‌-3,
👉 క్యాప్‌ 2,
👉 ఎన్‌సీసీ ఒకటి,
👉 స్పోర్ట్స్‌ 0.5 శాతాల్లో సీట్ల కేటాయింపు ఉంటుంది.
👉 దీంతో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు 50 సీట్లు,
👉 ఎన్‌ఆర్‌ఐ కోటా కింద 20 సీట్లలో విద్యార్థులను భర్తీ చేయనున్నారు.
👉 అన్ని విభాగాల్లో బాలికలకు 33.3 శాతం ప్రవేశాల్లో రిజర్వేషన్‌ పాటిస్తారు.
▪ ప్రవేశ విధానం..
✍ పదో తరగతిలో జీపీఏ ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తారు.
✍ ప్రభుత్వం, నాన్‌రెసిడెన్షియల్‌ పాఠశాలలు, ఇతర జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వెనుకబాటు సూచిక కింద 0.4 పాయింట్లను వచ్చిన పదో తరగతి గ్రేడుకు జతకలిపి ప్రవేశాల్లో ప్రాధాన్యత కల్పిస్తారు.
✍ సీట్ల కేటాయింపు సందర్భంలో సమాన గ్రేడు పాయింట్లు ఉన్నట్లయితే మొదట గణితం, తర్వాత జనరల్‌ సైన్స్‌, ఆ తర్వాత ఇంగ్లీష్‌, ఆ తర్వాత సోషల్‌ స్టడీస్‌, ఆ తర్వాత ఫస్ట్‌ లాంగ్వేజీలో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు.
✍ అయినా సమానమైతే పుట్టిన తేది ప్రకారం పెద్ద వయస్సు ఉన్నవారికి అవకాశం ఇస్తారు.
✍ దరఖాస్తు చేసుకునే విధానం...
✍ అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
✍ మీసేవా, పీఎస్‌ ఆన్‌లైన్‌ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
✍ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 150,
✍ ఓసీ, బీసీ విద్యార్థులు రూ.200 ప్రవేశరు సుము చెల్లించాల్సి ఉంటుంది.
✍ ఈ మొత్తాన్ని ఆయా ఆన్‌లైన్‌ సెంటర్ల వద్దనే చెల్లిం చాలి.
✍ దీంతో పాటు ఆ సెంటర్‌ సర్వీస్‌ చార్జీ కింద మరో రూ.25లు వసూలు చేయనున్నారు.
👉 ముఖ్యమైన తేదిలు..
👉 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం తేది 28-04-2017
👉 చివరి తేది 24-05-2017
✍ దరఖాస్తు దారులు తమ సర్టిఫికేట్‌లను యూనివర్సీటికి పంపించాల్సిన ఆఖరు తేది : 29-05.2017
✍ విద్యార్థుల ఎంపిక జాబితా విడుదల జూన్‌ 5.
✍ మొదటి కౌన్సెలింగ్‌ జూన్‌ 19, 20 తేదిల్లో
✍ ప్రత్యేక కెటగిరీ విద్యార్థులకు కౌన్సెలింగ్‌ జూన్‌ 22, 24, 27 తేదిల్లో
✍ చివరి దశ కౌన్సెలింగ్‌ జూన్‌ 29, 30 తేదిల్లో.
✍ కొత్త విద్యార్థులకు జూలై 1వ తేది నుంచి తరగతులు ప్రారంభం.
✍ఫీజుల వివరాలు...
✍ ప్రవేశం పొందిన విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీలో 6 సంవత్సరాలు విద్యను అభ్యసించాల్సి ఉంటుంది.
✍ ఇందులో ఇంజనీరింగ్‌ సంబంధించిన అన్ని కోర్సులు ఉంటాయి.
✍ మొదటి రెండేళ్లు ఏడాదికి రూ. 36 వేలు,
✍ ఆ తర్వాత నాలుగేళ్లు ఏడాదికి రూ.40 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
✍ ప్రభుత్వం చెల్లించే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి అర్హులైన విద్యార్థులు మాత్రం ఎలాంటి ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు.
✍ రీయింబర్స్‌మెంట్‌ వర్తించని విద్యార్థులు మాత్రం మొత్తం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
✍ ఇలాంటి వారికి యూనివర్సిటీ బ్యాంకు నుంచి రుణ సదుపాయం కల్పించనుంది.
✍ అన్ని ఉచితమే...
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వమే అన్ని ఉచితంగా అందజేస్తుంది.
✍ ఆరు సంవత్సరాల పాటు ల్యాప్‌టాప్‌, మూడుజతల డ్రెస్సులు, రెండు జతల షూలు, ఇతర హాస్టల్‌లో అవసరమైన అన్నింటిని ప్రభుత్వమే సమకూర్చుతుంది.
✍ దీంతో పాటు కార్పొరేట్‌ స్థాయి కంటే ఎక్కువ వసతులను కల్పిస్తుంది.
✍ కౌన్సెలింగ్‌లో సమర్పించాల్సిన ధ్రువీకరణ పత్రాలు..
✍ ఎంపికైన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు వచ్చే సమయంలో అన్ని ద్రువీకరణ పత్రాలను సమర్పిస్తేనే ప్రవేశం కల్పిస్తారు.
✍ దరఖాస్తు చేసుకున్న సమయంలో పేర్కొన్న పత్రాల న్నింటిలో దగ్గరుంచుకోవాలి.
✍ దరఖాస్తు చే సుకున్న రశీదు, టెన్త్‌ హల్‌టికెట్‌,మార్కుల షీట్‌, రెసిడెన్షియల్‌ సర్టిఫికేట్‌, కులద్రువీక రణ పత్రాలు.

4 comments: