దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 71 సంవత్సరాలు పూర్తయింది. కానీ,
నేటికి దేశంలో 74.04 శాతం మంది మాత్రమే అక్షరాస్యులు అంటే దాదాపుగా 25 శాతం జనాభా
నిరక్షరాస్యులు. మన దేశంతో పాటు స్వాతంత్ర్యం సాధించిన అనేక దేశాల్లో అక్షరాస్యత
ఎంతో మెరుగ్గా ఉంది. అనేక దేశాలు వలస పాలకుల నుంచి స్వాతంత్ర్యం పొందిన పదేళ్లలోనే
పూర్తి అక్షరాస్యత సాధించాయి. మన పొరుగున ఉన్న, మనకంటే చిన్న దేశాలైన మయన్మార్
89.5 శాతం, శ్రీలంక 92 శాతం, మలేషియా 94.5 శాతం అక్షరాస్యత సాధించి ఎంతో మెరుగ్గా
ఉన్నాయి. ఆఫ్రికాలోని కాంగో దేశం 1958లో స్వాతంత్ర్యం పొందింది. కానీ అక్కడ నేటికి
82.8 శాతం అక్షరాస్యత నమోదైంది. మరి భారత్ లో ఈ దౌర్భాగ్యమెందుకు?
ప్రాధమిక విద్య మన విద్యా విధానానికి పునాది. మన దేశంలో ఆ
పునాదుల్ని బలోపేతం చేసుకోలేకపోయమన్నది వాస్తవం. మన దేశాన్ని ఒక వైజ్ఞానిక దేశంగా
తీర్చిదిద్దాలంటే న్యాయమైన సహేతుకమైన విద్యావ్యవస్థను స్థాపించాల్సి ఉందని జాతీయ
విజ్ఞాన కమీషన్ 2006లోనే అభిప్రాయపడింది. మన ప్రభుత్వ పాఠాశాలల్లో ఉపాధ్యాయులు
మంచి విద్యార్హత, విజ్ఞానం కలిగినవారు. వారు ఉద్యోగం పొందడానికి అనేక పోటి
పరిక్షల్ని ఎదుర్కొని విజేతలయ్యారు. కానీ నిర్వహణలో లోపాలు, నిబద్ధత లేమి కారణంగా
మన పాఠశాలలు కుదేలవుతున్నాయి. నిధుల స్వాహా, అవినీతి, అక్రమాలు మన పాఠశాలల్లో
విలయతాండవం చేస్తున్నాయి. నిరాశావహమైన ఈ పరిస్థితుల్ని ఎదిరించి పాలకులు సరైన
మార్గంలో నడిచేందుకు పదనిర్దేశం చేయగలిగే శక్తి ఒక్క యువతకే ఉంది. విద్యా రంగంలో
మన వేనుకబాటును సరిదిద్ది నిరాక్షరాస్యతను పారదోలేలా నాయకుల్ని ప్రేరేపించే బాధ్యత
యువత భుజస్కందాలపైనే ఉంది. ఇప్పటికైనా మన ప్రభుత్వాల అడుగులు ఆ వైపుగా కదులుతాయని
ఆశిద్దాం.
...జై హింద్...
- సాయినాథ్
రెడ్డి.
Good
ReplyDelete